calender_icon.png 11 February, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు ఏజెంట్లుగా మారిన ఇంటెలిజెన్స్, లోకల్ ఐడీ పార్టీ

11-02-2026 12:52:17 AM

  1. సర్వే చేసి పరిస్థితులను వెల్లడిస్తున్న వైనం

అసాంఘిక కార్యకలాపాలలోను ఇదే తంతు 

ప్రభుత్వ జీతం... ప్రైవేటు ఉద్యోగం 

చర్చించుకుంటున్న ప్రజలు 

గజ్వేల్, ఫిబ్రవరి 10 : ప్రభుత్వ గూడచర్యం పక్కదారులు పడుతుందని ప్రజలు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నిక ల్లో ఆయా పార్టీలు నిబంధనలు ఉల్లంఘిం చి చేసే కార్యకలాపాలపై నిఘా పెట్టి ఆ స మాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన ఇంటలిజెన్స్, స్థానిక ఐడి పార్టీ సిబ్బంది స్వలాభం కోసం వాడుకుంటున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తుండగా ప్రజల్లో వారికి ఉన్న ఆదరణను సర్వే చేసి పలు పార్టీల అభ్యర్థులకు సమాచారం చేరవేస్తున్నట్లు, అందుకు ప్రతిఫలాన్ని కూడా పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ వేతనా లు తీసుకుంటూ ప్రభుత్వానికి గూఢచర్యం చేయాల్సిన ఇంటలిజెన్స్ స్థానిక ఐడి పార్టీ అ ధికారులు ప్రైవేట్ వ్యక్తులకు సహకరించడం ప్రభుత్వాలకు ప్రమాదకరమైన విషయం.

ఫలితంగా ప్రజల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పై విశ్వాసం కోల్పోయి ఏవైనా అసాంఘిక కా ర్యకలాపాలు జరిగితే సమాచారం ఇవ్వడానికి కూడా భయపడుతున్నట్లు సమాచారం. సాధారణంగా జూదం, పేకాట, అక్రమ రేష న్ బియ్యం తరలింపు, అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ తదితరాం శాలపై ఐడి పార్టీ అధికారులు, సిబ్బంది ప్ర జల నుండి సమాచారం సేకరించి దాడులు చేసి వారిని అరెస్టు చేయడం జరుగుతుంది. 

కానీ గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో జరిగే అసాంఘిక కార్యకలాపాల స మాచారం ఉన్నా కూడా వారితో లాలూచీ పడి కేసులు కాకుండా ఐడి పార్టీ సిబ్బంది చే స్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ, ఇతర వస్తువుల పంపిణీ జరుగుతున్న సమాచారం ఐడి పార్టీ సిబ్బందికి ఉన్నా కూడా ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయడంలో నిర్లక్ష్యం వ హిస్తున్నట్లు ప్రజలు గుసగుసలు పెడుతున్నారు. అంతేకాకుండా సదరు ఎన్నికల కమి షన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి వద్ద మామూళ్లు తీసుకుంటూ వారికి సహకరిస్తూ వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కొందరు అభ్యర్థులు కూడా చెప్పడం గమనార్హం.

ప్రభుత్వాలు, ఆయా శాఖలు ఇంటలిజెన్స్, ఐడి పార్టీ ఇచ్చే సమాచారంపై ఆధారపడి ప్రజారక్షణకు, ప్రభుత్వాల పనితీరుకు అవసరమైన చర్యలు తీసుకోవడం స హజం. అలాంటి ఇంటెలిజెన్స్, స్థానిక ఐడి పార్టీ సిబ్బంది ప్రభుత్వ జీతాలు తీసుకుం టూ ప్రైవేటు వ్యక్తులకు సమాచారాన్ని చేరవేయడం ఎంతవరకు సరైనదో వారే ఆత్మా వలోకనం చేసుకోవాల్సి ఉంది. 

 గూడచర్య వ్యవస్థకు పెనుముప్పు 

 స్థానికంగా ఇంటలిజెన్స్, ఐడి పార్టీ సిబ్బంది ప్రభుత్వానికి, పోలీసు శాఖ ఉన్నతాధికారులకు అందించాల్సిన సమాచారా న్ని ప్రైవేట్ వ్యక్తులకు చేరవేయడం ప్రభుత్వ గూడచార్య వ్యవస్థకు పెనుముప్పులా మా రింది. సమాజానికి, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్న ఇంటె లిజెన్స్ ఐడి పార్టీ అధికారుల పనితీరుతో భవిష్యత్తులో ఏవైనా భారీ స్థాయి అవాంఛనీయ ఘటనలు తలెత్తే అవకాశం లేకపో లేదు.

కొన్ని ప్రాంతాల్లో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలు తెలిసి కూ డా సమాచారం ఉన్నతాధికారులకు తెలుపకుండా ఆయా శాఖల అధికారులతో కుమ్మక్కై తమ జేబులు నింపుకుంటున్నట్లు ప్రజలు అంతటా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్, స్థానిక ఐడి పార్టీ సిబ్బంది విషయంలో అప్రమత్తం కాకపోతే పరిస్థితులు చేయి దాటేలా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐడి పార్టీ సిబ్బంది ఇంటెలిజెన్స్ అధికారులకే రిపోర్ట్ చేస్తారు

పోలీసు శాఖలో స్థానికంగా ఉండే ఐడి పార్టీ సిబ్బంది ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన పై అధికారులకే సమాచారం ఇస్తారు. మాకు వారు ఎలాంటి సమాచారం ఇవ్వరు. ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి మేము నేరాలు, నేరస్తుల విషయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఆరోపిస్తున్న విధంగా వారి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు.

 నరసింహులు, గజ్వేల్ ఎసిపి.