3 June, 2026 | 1:56 PM

హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా ఆటో కార్మికులకు బీమా భరోసా

03-06-2026 12:48 PM

గుర్రాలగొందిలో కేక్ కటింగ్ వేడుకలు..

18 మంది ఆటో కార్మికులకు రూ.10 లక్షల బీమా బాండ్ల పంపిణీ...

సిద్దిపేట రూరల్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదిన వేడుకలను గుర్రాలగొంది గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా నిలుస్తూ, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్‌రావు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సేవలో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

జన్మదిన వేడుకల్లో భాగంగా గ్రామానికి చెందిన 18 మంది ఆటో కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా పథకానికి సంబంధించిన బాండ్లను పంపిణీ చేశారు. అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా తమకు బీమా సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు మల్లేశం, ఆటో కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.