3 June, 2026 | 1:40 PM

దశలవారీగా గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్

03-06-2026 12:49 PM

బోథ్, జూన్ 3(విజయక్రాంతి): నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి దశలవారీగా చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు బుధవారం మండలంలోని పోచ్చర గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు కు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లన్నీ పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్తులో గ్రామాల్లో మట్టి రోడ్లు కనిపించకుండా సిసి రోడ్లు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.అయితే నిధుల కొరత వల్ల ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇది ఏమైనా సమీప భవిష్యత్తులో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ఇద్దామన్నారు కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి స్వామి స్థానిక సర్పంచ్ రాజు రెడ్డి మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ,రమణారెడ్డి, రాజారెడ్డి, దివాకర్ రెడ్డి, విష్ణు, రవీందర్, జాదవ్, మధుమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.