25 August, 2026 | 7:56 PM

జిల్లాలో విద్యుత్ కెపాసిటర్ల ఏర్పాటు

25-08-2026 05:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 99 విద్యుత్ కెపాసిటరి బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ బి రమేష్ తెలిపారు. రియాక్టివ్ పవర్ డిమాండ్‌ను నియంత్రించేందుకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో 2 MVAR కెపాసిటర్ బ్యాంకులు 87 Nos, 1  MVAR కెపాసిటర్ బ్యాంకులు 12 Nos, మొత్తం 99 Nos కెపాసిటర్ బ్యాంకులు 33/11కేవీ సబ్‌స్టేషన్లలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

11 కేవీ ఫీడర్ల వద్ద 16 Nos 600 KVAR లైన్ కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గ్రామీణ విద్యుత్ ఫీడర్లపై ఇండక్షన్  లోడ్ అధికంగా ఉండటం వలన   పవర్ ఫ్యాక్టర్ తగ్గి, విద్యుత్ ప్రవాహం మరింత మెరుగుపడుతుందని అన్నారు.  సర్కిల్ పరిధిలో గత రెండున్నర సంవత్సరాల కాలంలో  ఏర్పాటు చేశామని  వివరించారు. రైతాంగానికి నాణ్యమైన, స్థిరమైన వోల్టేజ్‌తో విద్యుత్ సరఫరా అందించడంతో పాటు సాంకేతిక విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గాయని చెప్పారు.  కెపాసిటర్ బ్యాంకుల ద్వారా పిటిఆర్  సామర్థ్యం ఉపశమనం అవుతోంది అన్నారు.