26 August, 2026 | 1:24 AM

బీటీపీఎస్ కళాకారున్ని సన్మానించిన బిచ్చన్న సీఈ

25-08-2026 05:51 PM

పినపాక,(విజయక్రాంతి): 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు గ్రహీత సిద్దెల హుస్సేన్ ను భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిచ్చన్న సీఈ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక సేవకర్తగా, బహుజన గీతాలు పాటకుడిగా, వందే భారత్, జాతీయ సమైక్య అవార్డు బి టి పి ఎస్ ఉద్యోగి సిద్దెల హుస్సేన్ అందుకోవడం.

ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అదేవిధంగా  కళలు కళాకారులు ఎప్పుడు సమాజ హితం కోరే విధంగా వారి ఆటపాటలను ప్రజలకు చేరువ చేయాలని. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ జాతీయ అధ్యక్షులు వజీర్, రీజినల్ అధ్యక్షులు, వెలదండి ప్రసాద్, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, వీరబాబు,నరసింహారావు,కుంజ కృష్ణ, సాంబ, ఆరిఫ్,రత్నాకర్, సునీత రమాదేవి, తదితరులు పాల్గొన్నారు