వన మహోత్సవానికి... గురుకుల విద్యార్థినులతో పనులా...!
ప్రజా ప్రతినిధులు, అధికారుల కండ్లలేదుటే చోటు చేసుకున్న ఘటన...
ఆరు నెలల క్రితం ఇదే ఘటనలో విద్యార్థిని మృతి ఘటన మరిచారా...?
బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వం ఒకవైపు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యార్థినీలు కార్పొరేటర్ స్థాయిలో విద్యతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించడం జరిగింది. కేవలం విద్యార్థినీలకు పాఠాలు బోధించి ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా విద్యార్థులతో కుర్చీలు మోయించిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం బాలికల గురుకుల పాఠశాలలో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. చదువుకోవాల్సిన విద్యార్థులను పాఠశాల నిర్వహణ పనులకు వినియోగించడంపై తల్లిదండ్రులు, విద్యార్థుల సంక్షేమాన్ని కోరుకునే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వన మహోత్సవం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైన సమయంలోనే విద్యార్థినులతో కుర్చీలు, ఇతర సామగ్రి తరలించే పనులు విద్యార్థినిలతో చేపిస్తున్న పట్టించుకోరా అంటూ విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం ఎంతవరకు శ్రద్ధ చూపుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులతో శారీరక శ్రమ ఎందుకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉంది. పాఠశాలలో అవసరమైన పనులను సిబ్బందితో చేయించాల్సి ఉండగా.. విద్యార్థులతోనే కుర్చీలు, సామగ్రి మోయించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
ఆరు నెలల క్రితం ఇదే ఘటనలో విద్యార్థిని మృతి
ఇదే పాఠశాలలో సుమారు ఆరు నెలల క్రితం కుర్చీలు మోసే ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెంది, పలువురు విద్యార్థినిలకు గాయాలైన విషయం తెలిసిందే. బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తి ఘటన మరిచారా అనే పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా మరోసారి విద్యార్థినులతో కుర్చీలు మోయించడం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలు గడవకముందే మరోసారి విద్యార్థినీలతో పనులు చేయించడం పట్ల పలు విమర్శలు తావిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పలువురు విద్యావంతులు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.






