తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ దారుణ హత్య
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటెశ్వర్లు (50) దారుణ హత్య కు గురయ్యారు. తగిలేపల్లి శివారులోని వ్యవసాయ పొలం వద్ద మైసమ్ వెంక వెంకటెశ్వర్లు తలపై పదునైన ఆయుధంతో దాడి చేశారని తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడే మృతి చెందాడని సిఐ కృష్ణ తెలిపారు. ప్రక్క ప్రక్కన ఉన్న పొలం తగాదాల వల్లే బక్క నారాయణ అతని కుమారులు కలిసి వెంక వెంకటెశ్వర్లు ఐన నా భర్తను హత్య చేశారని భార్య రుకుం బాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
గతంలో వెంకటెశ్వర్లు ఎంపిటిసి ఉన్నప్పుడు నిందితుడు బక్క నారాయణ ఉప సర్పంచ్ గ పని చేశారు. అప్పటి నుండి కొన్ని కారణాల వల్ల రాజకీయ కక్షలు పేరుగాయి. రాజకీయ కక్షలు,భూ వివాదం వెంకటెశ్వర్లు ప్రాణం తీసింది. మృతుడు వెంకటెశ్వర్లు ఒకసారి ఎంపిటిసి 2 పర్యాయాలు సర్పంచిగా పని చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితుడినీ త్వరలో పట్టుకుంటామని సిఐ కృష్ణ తెలిపారు.






