రైతాంగ ఉద్యమాలకు సిద్ధం కావాలి
ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ఆలేరు,(విజయక్రాంతి): రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం మహత్తర రైతాంగ ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభల పోస్టర్‌ను ఆలేరు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, నకిలీ విత్తనాలు–ఎరువుల సమస్యను అరికట్టాలని, రైతు రుణభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి, కనీస వేతనాలు, భూమి, నివాస హక్కులు కల్పించాలని కోరారు. మహాసభలకు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






