20 June, 2026 | 6:56 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చెయ్యాలి: దుర్గం దినకర్

20-06-2026 05:47 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఖీర్డి గ్రామంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. ఖీర్డి గ్రామంలోని రామ్‌మందిర్‌ వాడలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని శనివారం గ్రామస్తులతో కలిసి వాంకిడి మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ సబ్‌ ఇంజనీర్ శరత్ చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలు, వృద్ధులు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సబ్‌ ఇంజనీర్ శరత్ చంద్ర నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.