15 April, 2026 | 4:04 AM

మహనీయుల స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలి

15-04-2026 12:10 AM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం గ్రామం నుండి మండల కేంద్రం వరకు మండల దళిత సంఘం,వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దాంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు విజయవంతం నిర్వహించడం జరిగింది.

అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, పలువురు నాయకులు మాట్లాడుతూ... అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి చేశాడని తెలిపారు.  కొలం బియా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య సాధించి అరుదైన గౌరవం పొందారన్నారు.సామాజిక, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేశారని వివరించారు.

సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అనగారిన వర్గాలకు సమాన న్యాయం కలిగించాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారన్నారు. ప్రజలంతా మొదట విద్యావంతులైతేనే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మి ఆదిశగా కృషిచేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

స్వేచ్ఛ సమానత్వం,సబ్రాత్రుత్వం అందరికీ దక్కేలా రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులతోనే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు కులమత అసమానతలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని అంబేద్కర్ కలలు గన్నారన్నారు. నేడు ఆకలలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కోరారు.  దళిత సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.