04-02-2026 01:55:10 AM
వేములవాడ, ఫిబ్రవరి 03(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కోసం వీల్చైర్ ర్యాంపు, లడ్డూ కౌంటర్, పార్కింగ్, క్యూ లైన్లు, టెంట్లు, టాయిలెట్స్ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. ప్రోటోకాల్ కార్యాలయంలో ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ స్వామివా రిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈఓ ఎల్. రమాదేవి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డిఈ లు శాంతయ్య, వర ప్రసాద్, ఆలయ డీఈ లు రఘునందన్, మహిపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మన్న, శ్రీనివాస్, ఆలయ అర్చకులు,అధికారులు, పాల్గొన్నారు.