17 April, 2026 | 10:06 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉపాధి పనుల పరిశీలన

17-04-2026 08:38 PM

వాంకిడి,(విజయక్రాంతి): జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.దత్తారం శుక్రవారం వాంకిడి మండలంలోని సారండి గ్రామ పంచాయతీలో జరుగుతున్న సీసీటీ ఉపాధి హామీ పనుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటలకే పనికి హాజరై, కొలతల ప్రకారం రోజుకు రూ.307 వేతనం పొందేలా పనులు చేయాలని సూచించారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ వంటి మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సర్పంచ్ బాపూజీకి ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై, గ్రామానికి సమీపంలో తవ్వకాలకు అనుకూలమైన పనులను గుర్తించి ప్రాధాన్యంగా చేపట్టాలని,సూచించారు.రైతులకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, కొత్త పనుల కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పై అధికారులకు పంపాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలాజీ, ఏపీఓ శ్రావణ్ కుమార్, ఈసీ మోసిన్, TA,  పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.