ఇన్నయ్య తండ్రి అంత్యక్రియలు పూర్తి
03-03-2026 12:40 AM
- జనగామ జిల్లా సాగరం సాల్మాన్‌రెడ్డి ఆఖరి మజిలీ
- పెరోల్ మీద హాజరైన ఇన్నయ్య
మహబూబాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, సామాజి కవేత్త గాదె ఇన్నయ్య తండ్రి సాల్మాన్‌రెడ్డి అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య సోమవారం జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం సాగరం గ్రామంలో నిర్వహించారు. పెరోల్ మీద బయటకు వచ్చిన ఇన్నయ్య.. తం డ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
వేలాదిమంది ఇన్నయ్య అభిమానులు, బంధుమి త్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘా ల నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యా రు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహ రి, ప్రొఫెసర్ కోదండరాం సాల్మన్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇన్నయ్యను పరామర్శించి ఓదార్చారు.




