స్థానిక ఎంఎస్‌ఎంఈలకు అన్యాయం
పాఠశాలల్లో సోలార్ వ్యవస్థలకై పెద్ద కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు
- తాము నష్టపోతామని తెలంగాణ సోలార్ సంస్థల ఆవేదన
- జోక్యం చేసుకోవాలని కేటీఆర్‌కు టీఎస్‌ఈఏ ప్రతినిధుల వినతి
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన టెండర్ నిబంధనలు తెలంగాణలోని చిన్న, మధ్య (ఎంఎ స్‌ఎంఈ) తరహా సోలార్ సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ప్రతికూలంగా ఉన్నాయని తెలం గాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (టీఎస్‌ఈఏ) ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ టర్నోవర్, అనుభవం, అధిక డిపాజిట్ నిబంధనలు ఉండటం వల్ల టెండర్లలో పాల్గొనలేకపోతున్నాయని వాపోయారు. న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ టీఎస్‌ఈఏ ప్రతినిధులు శుక్రవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరుఝూ బడి కార్యక్రమంలో తెలంగాణకు చెందిన సోలార్ పారిశ్రామి కవేత్తలకు సమాన అవకాశాలు కల్పించారని, దీంతో తమ సామర్థ్యం నిరూపించుకున్నాయ ని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయని, చిన్న, మధ్య తరహా సోలార్ సంస్థలు పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయగలవని నిరూపిత మైందని తెలిపారు. ప్రస్తుతం 10 వేల ప్రభు త్వ పాఠశాలల్లో 2, 3, 5 కిలోవాట్ల రూప్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం విడుదల చేసిన టెండర్ నిబంధనలు ఇబ్బంది కరంగా ఉన్నాయన్నారు.
కనీస వార్షిక టర్నోవర్ రూ.150 కోట్లు ఉండాలని, ఒకే సంవత్సరంలో 25 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన అనుభవం ఉండాలని నిబంధనలు పెట్టిందని, ఈ రూల్స్ స్థానిక సోలార్ సంస్థలను పోటీ నుంచి దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత దశా బ్ద కాలంలో తెలంగాణలో వార్షిక రూప్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు చాలా సందర్భాల్లో 20 మెగావాట్లను కూడా దాటలేదని, అలాంటి పరిస్థితుల్లో 25 మెగావాట్ల అనుభవం నిబంధన విధించడం సరికాదన్నారు.
ఇది కొన్ని పెద్ద సంస్థలకు ముఖ్యంగా రాష్ట్రానికి వెలుపల ఉన్న కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. ఇంతకుముందు విడుదలైన సోలా ర్ టెండర్లు కూడా రాష్ట్రం వెలుపల సంస్థలకు కేటాయించినవేనని, ఏడాది గడిచినా ఆశించిన పురోగతి కనిపించలేదని తెలిపారు. కఠిన మైన నిబంధనలతో కూడిన కొత్త టెండర్ స్థానిక సోలార్ సంస్థలకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగా ణ ఎంఎస్‌ఎంఈ విధాన స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ఈ విషయమై పలుమార్లు అధికారు లకు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లభించలేదన్నారు. తెలంగాణకు చెందిన సోలార్ సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనే లా అర్హత ప్రమాణాలను సవరించేందుకు జోక్యం చేసుకోవాలని కేటీఆర్‌ను టీఎస్‌ఈఏ ప్రతినిధులు కోరారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఎంఎస్‌ఎంఈ రంగం అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్రా అశోక్‌కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ శ్రీహరి బాబు, జాయింట్ సెక్రటరీలు బాబునాయు డు, శ్రీనివాస్ కుక్కడపు, వైస్ ప్రెసిడెంట్ రాజే ష్ పరకాల, బదరి నారాయణ, జాన్ విల్యం, రాఠి తదితరులు ఉన్నారు.






