5 April, 2026 | 4:03 AM

2,813 మందితో ఇన్ఫినిటీ చిహ్నం ఆవిష్కరణ

05-04-2026 12:07 AM
  1. ఆటిజంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నం 

ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు

ఖైరతాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సమ్మిళిత సమాజం పట్ల తమకున్న నిబద్ధతను చాటుతూ 2813 మందికి పైగా వ్యక్తులు ఏకమై మానవ ఇన్ఫినిటీ చిహ్నాన్ని విజయవంతంగా ప్రదర్శించారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ న్యూరోడైవర్సిటీకి ప్రపంచవ్యాప్త గుర్తు అయిన ఈ చిహ్నాన్ని మార్హం - రెజోనేటింగ్ రెసిలియన్స్ సంస్థ, విక్కీ హోలిస్టిక్ చైల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు గూగుల్ డెవలపర్ గ్రూప్ హైదరాబాద్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఇన్ఫినిటీ - హ్యూమన్ ఎడిషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారన్నారు.

ఈ భారీ ప్రదర్శన ఇండియా బుక్ ఆఫ్ రికారడ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొంది ఒక కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. న్యూరోడైవర్స్ వ్యక్తుల పట్ల అవగా హన, అంగీకారం, సమ్మిళితత్వాన్ని పెంపొందించే దిశగా సాగుతున్న సామూహిక ప్రయ త్నాల్లో ఇది ఒక గొప్ప ఘట్టంగా నిలిచిందన్నారు. డాక్టర్ నబాత్ మాట్లాడుతూ ఇన్ఫినిటీ హ్యూమన్ ఎడిషన్ అనేది సానుభూతి, అవగాహన, అంగీకారాన్ని చాటిచెప్పే ఒక సామూహిక వేదిక అని పేర్కొన్నారు. ఈ రికార్డు కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదని, ఇది అందరినీ కలుపుకుపోయే తత్వానికి నిదర్శనమని అన్నారు