5 April, 2026 | 5:33 AM

ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌వే!

05-04-2026 12:55 AM

వైస్ చైర్మన్లుగా ఒకచోట సీపీఐ, మరోచోట బీజేపీ కౌన్సిలర్లు

౯మంచిర్యాల/ఇబ్రహీంపట్నం/అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): రాష్ట్రంలో 51 రోజులుగా పెం డింగులో ఉన్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు తెరపడింది. రెండు చోట్లా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. అవగాహన ఒప్పందంతో ఇబ్రహీంపట్నంలో వైస్ చైర్మన్ పదవి బీజేపీ దక్కించుకోగా క్యాతనపల్లిలో సీపీఐ దక్కించుకుంది.

ఇబ్రహీం పట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ హైకోర్టు జోక్యంతో శనివారం విజయవంతంగా ముగిసింది. భారీ బందోబస్తు, రాజకీయ ఆరోపణల మధ్య జరిగిన ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుం ది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి (బీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా ముత్యాల శ్యామల భాస్కర్ (బీజేపీ)గా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్  ఎన్నిక కోసం  ఎన్నికల అధికారులు ‘చేతులు ఎత్తే పద్ధతి‘ ద్వారా ఓటింగ్‌ను నిర్వహించా రు.

చైర్మన్ పదవి కోసం బీఆర్‌ఎస్ తరఫున సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున ఆకుల యాదగిరి పోటీ పడ్డారు. మెజారిటీ కౌన్సిలర్లు సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన విజయం ఖాయమైంది. అయితే ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్య ర్థి చైర్మన్ కావడానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈ ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగడానికి ముందు తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ముగ్గు రు కౌన్సిలర్లపై కోర్టులో కేసులు పెండిం గ్లో ఉన్నాయని, తీర్పు వచ్చేవరకు ఎన్నిక ఆపాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఎన్నికల అధికారి స్పందిస్తూ, తా ము ఈ ఎన్నికను స్వచ్ఛందంగా కాకుం డా, హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే నిర్వహిస్తున్నామని, చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేస్తూ ప్రక్రియను కొనసాగించారు. 

భారీ బందోబస్తు మధ్య క్యాతనపల్లి పాలకవర్గం ఎన్నిక 

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌ల ఎన్నికలు జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు మనోజ్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్ర సాద్‌ల సమక్షంలో శనివారం జరిగాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందో ళనలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీ సులు గట్టి బందోబస్తు నిర్వహించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తిరిగి బందోబస్తును పర్యవేక్షించారు.

ఎంతో ఉత్కంఠత మధ్య మున్సిపల్ పీఠం ఎట్టకేలకు బీఆర్‌ఎస్ చేజిక్కించుకుంది. రెండు సార్లు వాయిదా పడటం, బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు, జైళ్లకు తరలింపు ఘటనల తర్వాత మూడవ సారి ఎన్నిక సాఫీగా జరిగింది. 22 వార్డులకు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ కూట మి పోటీ చేసి బీఆర్‌ఎస్ పది, సీపీఐ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది.

కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, స్వతంత్రులు ఒక వార్డులో విజయం సాధించారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా గొడిసెల సంధ్యారాణి (బీఆర్‌ఎస్), వైస్ చైర్ పర్సన్‌గా మిట్టపెల్లి సరిత (సీపీఐ) లను మెజార్టీ కౌ న్సిలర్లు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిల ర్లు గైర్హాజరయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ చేజిక్కించుకునేందుకు మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీ వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డిలు సర్వప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యారు.