12 April, 2026 | 8:00 PM

పెద్దమల్లారెడ్డిలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

12-04-2026 06:16 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ రెండు ఇండ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పేదలకు సొంతింటి కలను నెరవేర్చడంలో ఇందిరమ్మ పథకం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లబ్ధిదారులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చైతన్యకొండల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాగారెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, బుచ్చయ్య, బాలరాజు, నటలింగం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.