29 April, 2026 | 8:45 PM

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు

29-04-2026 06:55 PM

ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గంలో వేగంగా  3500 ఇళ్ల నిర్మాణాలు

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

చుంచుపల్లి,(విజయక్రాంతి)పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో నీడాల సుధాకర్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని బుధవారం ఆయన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవతో నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజల కోసం మంజూరైన 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయని, ఇప్పటికే 70 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.  మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే సరిచేసి లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు. పేదలకు గూడు కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.