29 April, 2026 | 8:21 PM

Breaking News

సుల్తానాబాద్ పురపాలక సమావేశంలో 29 అంశాలపై తీర్మానం   •   ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లలో పాటు ఒక కానిస్టేబుళ్లు సస్పెండ్   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక   •   అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి   •   అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   సుల్తానాబాద్ మండలంలో 10 ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం   •   పదవ తరగతి ఫలితాలలో ఎస్వీ విద్యార్థుల ప్రభంజనం   •   పది ఫలితాలలో భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థినుల విజయకేతనం   •   పేదింటి ఆడబిడ్డకు అండగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు   •  

పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం

29-04-2026 06:50 PM

మంగపేట,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అక్కెనపెళ్లి వెంకటేశ్వర్లు ఇద్దరు కుమార్తెలు అక్కెనపెళ్లి రీత్విక, మధుమిత బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఉత్తమ జీపీఏ సాధించిన అక్కెనపెళ్లి రీత్విక, మధుమిత అనే ఇద్దరు స్టూడెంట్స్ ను  మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది దాగం ఆదినారాయణ బుధవారం శాలువాలతో ఘనంగా సన్మానించి మేమెంటో  అందజేశారు. ఈ సందర్భంగా  దాగం ఆదినారాయణ మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ, అంకితభావంతో, ఇష్టపడి చదువుతూ మరిన్ని విజయాలు సాధించాలని, కన్న వారికి , పుట్టి పెరిగిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు.