12 May, 2026 | 11:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

టీ20 ప్రపంచకప్‌కు భారత్ జెర్సీ ఆవిష్కరణ

04-12-2025 12:29 AM

రాయ్‌పూర్, డిసెంబర్ 3 : వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జ ట్టు ధరించే జెర్సీని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. రాయ్‌పూర్ వన్డే బ్రేక్ టైమ్ లో ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసి డర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ చేతుల మీదు గా జెర్సీని విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో యువ ఆటగాడు తిలక్ వర్మ, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జెర్సీ స్పాన్సర్ అపోలో టైర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారీ సైజ్ టీ20 ప్రపంచకప్ జెర్సీని గ్రౌండ్‌లో ప్రదర్శించారు. నీలిరంగులో ఉన్న జెర్సీ రెండు వైపులా ఆరెంజ్ ప్యానెల్స్, వర్టికల్ బ్లూ స్ట్రుప్స్ ఉన్నాయి. జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్న రోహిత్ 2024 టీ20 వరల్డ్ కప్ విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. తొలి వరల్డ్‌కప్ గెలిచాక మళ్లీ ట్రోఫీ అందుకోవడానికి సుధీర్ఘ కాలం వేచి చూడా ల్సి వచ్చిందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని ఆకాంక్షించాడు.