calender_icon.png 19 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విండీస్‌తో భారత్ ఢీ

19-01-2025 12:55:35 AM

అండర్ టీ20 ప్రపంచకప్

కౌలాలంపూర్: మలేషియా వేదికగా జరుగుతున్న అండర్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత అమ్మాయిలు వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నారు. నికి ప్రసాద్ సారధ్యంలోని యంగ్ ఇండియా డిఫెండింగ్ చాంపియ్ హోదాలో బరిలోకి దిగుతోంది. తెలుగుతేజం గొంగడి త్రిష, కమలిని, సైనికా,సోనమ్ యాదవ్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది.

బౌలింగ్ లో ఆయుషి శుక్లా, షబ్నమ్ కీలకం కానున్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలి యా స్కాట్లాండ్‌పై, బంగ్లాదేశ్ నేపాల్‌పై, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌పై విజయాలు సాధిం చగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్ మ్యాచ్‌తో పాటు పాకిస్థాన్, అమెరికా మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి.