calender_icon.png 19 January, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాత్విక్ జోడీ పరాజయం

19-01-2025 12:58:14 AM

ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ లో భారత డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఓటమి పాలయ్యారు. మ్యాచ్‌లో సాత్విక్ జంట 18 14 మలేషియాకు చెందిన జె ఫెయ్‌ ఇజుద్దీన్ జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.

2022లో చాంపియన్స్ అయిన చిరాగ్ ద్వయం 37 నిమిషాల్లో ప్రత్యర్థులకు ఆటను అప్పగించింది. కాగా ఇటీవలే ముగిసిన మలేషియా ఓపెన్‌లోనూ సాత్విక్ జంట సెమీస్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సింగిల్స్‌లో పీవీ సింధూ, కిరణ్ జార్జి క్వార్టర్స్‌కే పరిమితమయ్యారు.