మార్చి 31 నాటికి మావోయిస్టు రహితంగా భారత్
ఒడిశా: మార్చి 31 నాటికి భారతదేశం మావోయిస్టుల నుండి విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి నేపాల్‌లోని పశుపతి వరకు రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు కనే వారిని భద్రతా దళాలు ఓడిస్తాయన్నారు.
కటక్ జిల్లాలోని ముండలిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (Central Industrial Security Force) 57వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రధాన సంస్థలకు భద్రత కల్పించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఈ దళం ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. "మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని ఈరోజు నేను దేశానికి హామీ ఇవ్వాలనుకుంటున్నాను. తిరుపతి నుండి పశుపతి వరకు రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు కనే వారిని మన దళాలు ఓడిస్తాయి" అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.




