17 August, 2026 | 4:09 AM

భారత్ భారీ స్కోరు

17-08-2026 02:02 AM

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత బ్యాటర్లు అదరగొట్టారు. వర్షం పదే పదే అంతరాయం కలిగించినా రెండో రోజు కూడా భారత్ దే అధిపత్యంగా నిలిచింది. 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా భారత్460/9 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.

  1. వర్షంతో సగం రోజు ఆట రద్దు
  2. పడిక్కల్ భారీ ఇన్నింగ్స్
  3. జురెల్ హాఫ్ సెంచరీ
  4. టీమిండియా 460/9

గాలే, ఆగస్టు 16: భారత్, శ్రీలంక తొలి టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నా డు. రెండోరోజు వర్షం కారణంగా ఒకటిన్నర సెషన్ ఆట రద్దయింది. కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయింది. అయితే రెం డో రోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. పడిక్కల్ భారీ సెంచరీ(167) కి తోడు ధృవ్ జురెల్ హాఫ్ సెంచరీ, టెయిలెండర్లు కూడా ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు తొలి సెష న్ పూర్తిగా వర్షంతో రద్దయింది.

రెండో సెషన్‌లో సగం కూడా వర్గంతోనే తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ఆరంభమైనతర్వాత పడిక్కల్, పంత్ ఇన్నింగ్స్ కొనసాగించారు. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం అం దకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్‌ను సమర్థ వంతంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 71 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. పంత్ 39 పరుగులకు ఔట్ అయ్యాక తొలి రోజు గా యంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన కే ఎల్ రాహుల్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.

అయితే తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 5 పరుగులు మాత్రమే జోడించి ఔట్ అయ్యాడు. మరోవైపు తొలి డబుల్ సెంచరీ సాధించేలా కనిపించిన పడిక్కల్‌స్టంపౌటయ్యాడు. మొ త్తంగా ఈ కర్ణాటక బ్యాటర్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 167 పరుగులు చేశా డు. ఈ క్రమంలో పడిక్కల్ ఓ అరుదైన ఘ నత అందుకున్నాడు. శ్రీలంకపై టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 150 ప్లస్ స్కోరు సాధించిన మూడో భారత బ్యాటర్గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు.

తర్వాత జడేజా (13) నిరాశ పరిచినా, మానవ్ సుతార్ తో కలిసి జురెల్ ఇన్నింగ్స్ ముందు కు నడిపించాడు. వీరి జోడీ 55 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. హఫ్ సెం చరీ చేసిన జురెల్ ఔట్ అయిన తర్వాత సిరాజ్ (11), సుతార్ (24) పరుగులకు వె నుదిరిగారు.

అయితే కుల్దీప్ యాదవ్, ప్రసి ద్ధ కృష్ణ చివరి వికెట్ పడకుండా ఆటను ముగించారు. దీంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 460 పరుగులు చేసింది.క్రీజులో కుల్దీప్ యాదవ్ (12), ప్రసిద్ధ్ కృష్ణ (1) ఉన్నారు.లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు, కేశర ను వంత 3 వికెట్లు పడగొట్టారు.సుమారు ఐదు గంటల ఆలస్యం తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగా, కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. మొత్తంగాభారత్ 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు జోడించింది.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 460/9 (పడిక్కల్ 167, రాహుల్ 82, జురెల్ 51, పంత్ 39 జైస్వాల్ 32, ప్రబాత్ జయసూర్య 4/109, కేశర నువంత 3/175)