11 July, 2026 | 1:42 AM

పరువు దక్కేనా ?

11-07-2026 12:00 AM

ఇంగ్లాండ్ చివరి టీ20

తీవ్ర ఒత్తిడిలో భారత్

తుది జట్టులో మార్పులు

ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి నుంచి తేరుకోకముందే ఇంగ్లాండ్ లోనూ ఘోరపరాజయం పాలైన భారత్ ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ శనివారం చివరి టీ20 ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. తుది జట్టులో మార్పులు చేయడం ఖాయమైన వేళ సౌతాంప్టన్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.

సౌతాంప్టన్, జూలై 10: ఇంగ్లాండ్ గడ్డపై వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకుని ఒత్తిడిలో ఉన్న భారత్ ఆఖరి టీ20 లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఒక విధంగా కొత్త కెప్టెన్ శ్రేయాస్ అ య్యర్‌కు ఈ మ్యాచ్ అగ్నిపరీక్ష కాబోతోంది. ఎందుకంటే సూర్యకుమార్ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత ఒక్క విజ యం కూడా శ్రేయాస్ రుచి చూడలేదు.

కాగా పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో వరు స పరాజయాలను మూటగట్టుకున్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. సంజూ శాంసన్ స్థా నంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడి తీవ్రంగా నిరాశపర్చిన వైభవ్‌ను పక్కన పె ట్టొచ్చు. లేదంటే అతన్ని కొనసాగించి ఇషాన్ కిషన్‌పై వేటు వేసి సంజూ శాంసన్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించే అవకాశాలున్నాయి. ఏది ఏ మైనా సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

అవసరమైతే అభిషేక్ శర్మకే రెస్ట్ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్ కూడా ఐర్లాండ్‌తో పాటు ఇం గ్లండ్ సిరీస్‌లో తీవ్రంగా నిరాశపర్చాడు. ఐ ర్లాండ్‌తో రెండు టీ20ల్లో 13 పరుగులే చేసి న ఇషాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యచ్‌లలో 66 పరుగులే చేయగలిగాడు.  అటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పైనా వి మర్శలు వస్తున్నాయి.

ఈ సిరీస్‌లో తిలక్ దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తిలక్ వర్మ 51 పరుగులే చేశాడు. టాపార్డర్ను కొనసాగించాలనుకుంటే సం జూ శాంసన్ కోసం తిలక్‌పై వేటు పడే ఛా న్సుంది. అటు శివమ్ దూబే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతన్ని తప్పించాలనుకుంటే యువ ఆల్రౌండన్ సూర్యాన్ష్ షె డ్జే తుది జట్టులోకి వస్తాడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కొ నసాగనున్నారు. ఒకవేళ సూర్యాన్ష్‌ను తీసుకుంటే దూబేను కొనసాగించి వాషింగ్టన్ సుందర్‌ను తప్పించే అవకాశాలున్నాయ.

అటు పేస్ బౌలర్లుగా ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే గాయాలతో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని ఇంగ్లాం డ్ పట్టుదలతో ఉంది. నాలుగో టీ20 విజయానంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇదే విషయాన్ని చెప్పాడు.  బ్యాటింగ్‌లో సాల్ట్, కెప్టెన్ బ్రూక్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో ఆర్చర్, టంగ్ అదరగొడుతున్నారు. మొత్తం మీద ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటే, భారత్ ఒత్తిడిలో కనిపిస్తోంది.

తుది జట్ల అంచనా 

భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ/సూర్యా న్ష్ షెడ్జే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, బట్లర్, బ్రూక్, బెథెల్, బాంటన్, సామ్ కురన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్