calender_icon.png 18 February, 2026 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరేనా పోలో ఫైనల్లో భారత్, ఫ్రాన్స్

18-02-2026 01:31:23 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 17: హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా జరుగుతున్న అరేనా పోలో చాంపియన్‌షిప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. 6 గోల్ పోలో చాంపియన్‌షిప్‌లో భారత్, ఫ్రాన్స్ ఫైవల్లో అడుగు పెట్టాయి. మొదటి సెమీఫైనల్లో నిన్న భారత్ 12 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. అర్సలన్ ఖాన్ 4 గోల్స్ చేయగా, చైతన్య కుమార్ 3 గోల్స్ సాధించారు.

మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్ 10 గోల్స్ తేడాతో అమెరికాపై విజయం సాధించింది. తొలి చక్కర్‌లో 5 గోల్స్ కొట్టి తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన ఫ్రాన్స్ తర్వాత అదే దూకుడు కొనసాగించింది. చివరి వరకూ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ రెండో చక్కర్‌లో 3 ,చివరి చక్కర్‌లో 2 గోల్స్ సాధించారు. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, ఫ్రాన్స్ 6 గోల్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇప్పటికే భారత్ జట్టు 4 గోల్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది.