calender_icon.png 17 February, 2026 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుమ్రాకు విశ్రాంతి

17-02-2026 01:45:41 AM

  1. నెదర్లాండ్స్‌పై రిజర్వ్ బెంచ్‌కు ఛాన్స్ 
  2. తుది జట్టులోకి  సిరాజ్ లేదా అర్షదీప్
  3. కుల్దీప్‌కు చోటు కష్టమే

అహ్మదాబాద్, ఫిబ్రవరి 16:  టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పై విజయంతో సూపర్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా బుధవారం నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. తర్వాతి రౌండ్‌లో అన్నీ పెద్ద జట్లతోనే మ్యాచ్‌లు ఉండనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్‌పై పలువురికి విశ్రాంతినివ్వడం ఖాయమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు.

సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు కొంచెం రిలాక్స్ అయ్యేందుకు బుమ్రాకు ఇదే చక్కని అవకాశం. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్ లేదా అర్షదీప్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. హర్షిత్ రాణా గాయంతో దూరమవడంతో జట్టులోకి వచ్చిన సిరాజ్ అమెరికాతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. అప్పుడు బుమ్రా లేకపోవడంతో పేస్ ఎటాక్‌ను లీడ్ చేసిన ఈ హైదరాబాదీ పేసర్ సత్తా చాటాడు.

దీంతో నెదర్లాండ్స్‌పై సిరాజ్ వైపే మేనేజ్ మెంట్ మొగ్గుచూపే ఛాన్సుంది. అటు అర్షదీప్ భారీగా పరుగులిచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సూపర్ 8 మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి అర్షదీప్ ఫామ్ అందుకోవాలని మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. టీ20ల్లో అత్యుత్తమ బౌలర్ గా పేరున్న అర్షదీప్ సౌతాఫ్రికా, కివీస్‌తో సిరీస్‌లలోనూ నిరాశపరిచాడు. దీంతో నెదర్లాండ్స్ పై ఫామ్ అందుకుంటే మాత్రం సూపర్ -8కు ముందు భారత్ బౌలింగ్ బలం పెరిగినట్టే.

మరోవైపు భారత్ తన తర్వాతి మ్యాచ్ లన్నింటినీ స్వదేశంలోనే ఆడనుంది. దీంతో తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే చెన్నై, అహ్మదాబాద్ , కోల్ కత్తా వికెట్లన్నీ దాదాపుగా బ్యాటర్లకే అనుకూలంగా ఉండడం , స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తిలనే కొనసాగించనున్నారు. దీంతో కుల్దీప్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక మిగిలిన జట్టులో రింకూసింగ్‌కు చోటు దక్కడంపై సందిగ్ఘత నెలకొంది.

రింకూ పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. అయితే రింకూను డ్రాప్ చేసి అదనపు బౌలర్‌ను ఆడిం చే అవకాశాల నూ కొట్టిపారేయ లేం. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త తడబాటును సరిచేసుకునేం దుకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ టీమిండియాకు మంచి అవకాశంగా చె ప్పొచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన రెండు మ్యాచ్‌లలో నూ డకౌటై నిరాశపరిచాడు. మళ్లీ ము నుపటి ఫామ్ అం దుకునేందుకు ఇంతకుమించిన అవకాశం దొరకదు.

అభిషేక్, ఇషాన్ కిషన్ జోడీని విడదీసే పరిస్థితి కనిపించడం లేదు. దీని ప్రకారం చూస్తే సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే మిగలనుంది. నిజానికి వరుస అవకాశాలు ఇచ్చినా కూడా సంజూ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ఇప్పుడు ఫామ్ కోల్పోయిన సంజూ కోసం దుమ్మురేపుతున్న ఇషాన్ జోరుకు బ్రేక్ వేసే అవసరం లేదన్నది పలువురి మాజీల అభిప్రాయం.

ఇదిలా ఉంటే నెదర్లాండ్స్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ , శిమమ్ దూబే కూడా ఎదురుచూస్తున్నారు. పాక్ పై డకౌటైన హార్థిక్ పాండ్యాపైనా అంచనాలున్నాయి. ఇక ఫీల్డింగ్‌కు సంబంధించి క్యాచ్ లు అందుకునే విషయంలో కొంచెం మెరుగుపడాల్సిన అవరసం కనిపిస్తోంది. మొత్తం మీద సూపర్ 8 మ్యాచ్ కు ముందు రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ కు నెదర్లాండ్స్ పై చోటు దక్కనుంది.