26 April, 2026 | 5:17 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

భారత్ మానవత్వంతో వ్యవహరించింది

08-03-2026 12:52 AM
  1. ఇరాన్ అభ్యర్థన మేరకే కొచ్చిలో నౌకల డాకింగ్‌కు అనుమతి

విదేశాంగ మంత్రి జైశంకర్

న్యూఢిలీ, మార్చి 7 : అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ నావికాదళ నౌకను కొచ్చిలో డాక్ చేయడానికి అనుమతించడంలో భౌగోళిక రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా భారతదేశం ‘మానవత్వం’తో వ్యవ హరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ 2026 వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హిందూ మహాస ముద్రంలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ నౌకలకు భారత్ ఇచ్చిన అనుమతులపై వివరణ ఇచ్చారు.

హిందూ మహాసము ద్రంలో మూడు ఇరాన్ నౌకలు ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన మిలాన్- 2026 (మిలన్ 2026) విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే, మార్చి మొదటి వారంలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముదరడంతో ఈనౌకలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మార్చి 1న ఇరాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు, మానవీయ కోణంలో ఆలోచించి వాటికి కొచ్చి పోర్టులో డాకింగ్ అనుమతి ఇచ్చినట్లు జైశంకర్ తెలిపారు. భారత్ చట్టపరమైన అంశాల కంటే మానవత్వానికే పెద్దపీట వేసిందన్నారు.