స్నానానికి వెళ్లి ముగ్గురు స్నేహితులు మృతి
సిద్దిపేట జిల్లా నాచారం హల్దివాగులో ఘటన
గజ్వేల్, మే 7 (విజయక్రాంతి): మరణంలోనూ ఆ మిత్రులు ఒకరినొకరు వీడలేదు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం సమీపంలోని హల్దీవాగులో మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ముగ్గురు యువకులు స్నానానికి వెళ్లి మృతిచెందారు.
ఎస్‌ఐజె ఆరోగ్యం తెలిపిన వివరాల ప్రకారం ప్రశాంత్(27), వికాస్ (27), ఆనంద్‌రెడ్డి(27) ముగ్గురు మిత్రులు తూప్రాన్‌లో జరిగిన మిత్రుని వివాహానికి బుధవారం వచ్చారు. వివాహం అయిపోయాక సమీపంలోని నాచారం లక్ష్మీనరసిం హస్వామి క్షేత్రానికి వచ్చారు. దర్శనానికి సమయం ఉండడంతో స్నానగుండం వెనక భాగంలోని హల్దివాగులో స్నానం చేయడానికి ప్రశాంత్, వికాస్ దిగగా ఆనంద్ రెడ్డి కారులో ఉన్నాడు. లోతు బాగా ఉండి కాలు జారిపడ్డారు.
ఈత రాకపోవడంతో ఇద్దరు వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా కారులోని ఆనంద్ రెడ్డి గమనించి మి త్రులను కాపాడడానికి చేయి అందించాడు. ఆ ప్రయత్నంలో ఆనంద్ రెడ్డి కూడా నీటిలో పడిపోయాడు. ముగ్గురికి ఈత రాకపోవడంతో కాలువలో మునిగిపోయారు. వాగు గట్టుపై బట్టలపై సెల్ ఫోన్లు మోగుతుండడంతో ఆ దారిన వెళ్తున్న గ్రామస్తులు దగ్గరికి వెళ్లి చూసి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కరుణాకర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కు టుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ము గ్గురి మృతదేహాలను గురువారం స్వాధీ నం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






