13 August, 2026 | 9:44 PM

తాగునీటి బోరు ప్రారంభం

13-08-2026 05:34 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో డీపీఈపీ పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ అధ్యక్షులు జువ్వాడి నరసింగరావు సహకారంతో గ్రామపంచాయతీ పాలకవర్గం నూతన తాగునీటి బోరును ప్రారంభించింది. ఈ సందర్భంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన బోరు ఏర్పాటుతో పాఠశాలలో తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు.

విద్యార్థులు, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని అన్నారు. అలాగే వేసవి కాలంలో తలెత్తే తాగునీటి ఎద్దడిని ముందస్తుగా నివారించేందుకు ఈ చర్య ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అరికుప్పల రాజం, ముత్యాల గంగరాజం, శనిగారపు లావణ్య–నరేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్‌తో పాటు ఒడ్డెర కాలనీ ప్రజలు పాల్గొన్నారు.