గర్భిణీలు బిడ్డ ఎదుగుదలకు పౌష్టికాహారం తీసుకోవాలి
13-08-2026 05:30 PM
బోథ్,(విజయక్రాంతి): గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సునాల మండల వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆస్పత్రిలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు అనారోగ్య సమస్యలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్ ఈ యశోద హెచ్ ఎస్ సంధ్య దేవి హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారు.






