1 July, 2026 | 2:37 PM

రాజోలిలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి

30-06-2026 08:59 AM

అలంపూర్: రాజోలి మండల కేంద్రం పరిధిలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.సోమవారం రాజోలి తహసీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ గోకారిలకు వినతిపత్రం అందజేశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో పాటు బోర్లు, బావులు ఎండిపోతున్నాయని, భారీ టిప్పర్లు, ట్రాక్టర్ల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.

రాత్రి వేళల్లో వాహనాలు గ్రామంలో సంచరించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఈ అంశంపై అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించి అక్రమ టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు.