1 July, 2026 | 2:37 PM

షేక్‌పల్లిలో ఘనంగా ఏరువాక పండుగ సంబురాలు

30-06-2026 09:01 AM

సుంకులమ్మ అవ్వకు ఆడపడుచుల బోనాల సమర్పణ....

ఎర్రవల్లి: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్‌పల్లి గ్రామంలో ఏరువాక పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పండుగ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో సుంకులమ్మ అవ్వకు బోనాలు సమర్పించారు.సాంప్రదాయ పద్ధతిలో బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్న మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏరువాక సంబురాలను విజయవంతం చేశారు....