10 August, 2026 | 2:18 AM

పున్నమీ జాబిల్లి వేళలో

10-08-2026 01:05 AM

మాటలా మూటవై ముద్దుగా పలకరా 

ఊహలా ఊటవై ఊపుగా పలకరా ॥

చూపులా చినుకులా చిలిపిగా పలకరా 

నవ్వులా పువ్వులా చక్కగా పలకరా ॥

గాలిలో గంధమై గానమై పలకరా 

గుండెలో రాగమై తియ్యగా పలకరా ॥

మధుమాస మల్లెలా 

మృదువుగా పలకరా 

మధురిమల ముచ్చట్ల 

జలధిగా పలకరా ॥

పున్నమీ జాబిల్లి వేళలో పలకరా 

విరహము రేపగా ప్రేమగా పలకరా ॥

స్వప్నాల సంద్రమై చల్లగా పలకరా 

స్పర్శలా సుధలతో చురుకుగా పలకరా ॥

రాజేంద్ర హృదయపు గీతమై పలకరా 

రాగమై కవితలా రాజుగా పలకరా ॥

(గజల్)

-  గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్