10 August, 2026 | 2:18 AM

‘చిత్రభారతం’లో ఋతువుల సంగతులు

10-08-2026 01:06 AM

క్రీ.శ.16-17 శతాబ్దుల మధ్యకాలంలో జీవించాడని భావించబడుతున్న చరిగొండ ధర్మన్న రచించిన కావ్యం ‘చిత్రభారతం’. తెలంగాణలో ఏకశిలానగరం ప్రాంతానికి చెందిన కవి ఈయన. భువిలో వెలసిన నరనా రాయణ స్వరూపాలైన అర్జునుడికి, శ్రీకష్ణుడికి మధ్య జరిగిన అసాధారణ యుద్ధం ఇందులో చరిగొండధర్మన్న కవిత్వీకరించిన ముఖ్యమైన, చిత్రమైన కథ. 

చ. వినుడుమహాత్ములారపథివీస్థలియందువిచిత్రలీలఁ గ

ష్ణునకునుదేవనాయకతనూజునకున్రణమయ్యె నొక్క రా

    జు నెపముచేత నర్జునునిఁజుట్టలతోడహరించెధర్మనం

దన్నఁడొకరుండ్నఁ దక్క యదునాయక్నఁడుగ్రరథాంగధారచేన్. 

అనిప్రథమాశ్వాసంలోని పై పద్యం(15) లో సంక్షిప్తంగా ‘చిత్రభారతం’ కావ్యంలోని కథను సూతుడు శౌనకాదిమహామునులకు చెప్పిన మాటలుగా చెప్పాడు చరిగొండ ధర్మన్న. నాగకన్యయైన ఉలూచికి అర్జునుడి వలన కలిగిన ఇలావంతుడు (మహాభారత కథలో ‘ఇరావంతుడు’అని పేర్కొనబడింది. చరిగొండ ధర్మన‘ఇలావంతుడు’అని వ్రాశాడు. ఆ పేరే ఈ వ్యాసంలోనూ పేర్కొనబడింది) భోగవతి అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకునినాగలోకాన్నిధర్మం తప్పకుండా పాలిస్తుండగా, ఒకనాడు శుకమహర్షిఇలావంతుడిని చూడడానికి వచ్చాడు. సాదరంగా ఆహ్వానించి సుఖాసీనుడిని చేసిన తరువాత ఇరువురి మధ్యన జరిగిన సంభాషణలో, ఇలావంతుడుఅడుగగాశుకమహర్షి కథ చెప్పడం మొదలుపెట్టాడు. తుల్యుడనే పేరున్న ఒక మహాముని తపస్సు చేస్తున్నాడు. వేసవి వచ్చింది. సూర్యుడు భూమిపై  నిప్పులు చెరిగాడు. ఎండలు మండిపోయాయి. లోకం లోని సకల చరాచర జీవకోటి సూర్యతాపానికి తట్టుకోలేక అల్లాడిపోయింది. 

తే. లోకముల జీవనంబెల్ల లోఁచిపుచ్చి

తనకరంబులఁగువలయస్థలముమేల్నఁ

జెఱచికడువెట్టయైనరాజీవబంధ్నఁ

డెట్లు తా మిత్నఁడ్రయ్యెనోయెంచిచూడ. 

( చిత్రభారతం, ద్వితీయాశ్వాసం, 5)

లోకంలోని సకల జీవుల జీవనాన్ని కలత పరచి, అమిత వేడిమితో కొలని నీళ్ళను సలసల కాగేలా చేసి,కువలయస్థలములు - తామరలకు నివాసస్థలములైన నీటి కొలనులకు హాని కలిగించే రాజీవబంధుడైన సూర్యుడు, తామరలకు మిత్రుడెలాగయ్యాడో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది --అని చమత్కరించాడు చరిగొండ ధర్మన. ఆ చమత్కారంలో ఎంతైనానిజముందని అనిపిస్తుంది కదా! అంత ఎండలోనూ తుల్యుడు తన ఉగ్ర తపస్సును కొనసాగించాడు. రోజులు గడిచాయి. ఋతువు మారింది. వానాకాలం వచ్చింది. వానలు కురవడం మొదలైంది.

తే. ఉత్తరపుదిక్కుమెఱుపులనుల్లసిలటఁ్ల

బూర్వదిగ్వాయుసంచయంబులుచెలంగటఁ

దగనహోరాత్రములునుసంధ్యలునుదెలియ

రాకయుండెనుమేఘసంరంభమునను. 

( ద్వితీయాశ్వాసం, 17)

ఆ వానాకాలంలో, మంచి వానలు పడే సంకేతాలు జనులకు ఎలా కనిపించాయో, మంచి వానలు పడతాయని గుర్తించడానికి వారికి ఎలా వీలయిందో చెప్పాడు ధర్మన్న పై పద్యంలో. కొన్ని వందల సంవత్సరాల పరిశీలన అనంతరం మనిషి తెలుసుకున్న, ప్రకతిలో మార్పులకు సంబంధించిన, సత్యాలు తరం నుంచి తరానికి చేరుతూ మానవుడి మస్తిష్కంలో స్థిరపడిపోయి ఉన్నాయి. అటువంటి ప్రకతి సత్యాలలో ఒకటి పైన చెప్పిన పద్యంలోనిది. ఉత్తర దిక్కున మెరుపులు మెరిసినప్పుడు, తూర్పు దిక్కన చల్లని గాలులు బలంగా వీచినప్పుడు, ఏది పగలో ఏది రాత్రోతెలీకుండాపోయేంతగానల్లటి మబ్బులు ఆకాశం నిండా కమ్మి మంచి వానలు పడతాయని గ్రహించాలి అని పై పద్యంలో చెప్పబడింది. అలా ధారాపాతంగా పడిన వానకు,‘నిష్కళంకాత్మయైనెగడు వసుంధర, యత్యంతపం కాత్మయైచెలంగె’-- కళంకం లేని ఆత్మ కలిగిన భూదేవి ఎటు చూసినా,  ఎక్కడ చూసినా కళంకంతో నిండిపోయి బురదమయంగామారిపోయిందట. కుండపోతగా కురిసిన వానలకు ‘అమత ప్రవాహాఢ్యలయిన మహా నదుల్గలుషవిషాఢ్యలైకలఁగఁబాఱె’-- అప్పటిదాకా అమృతమనిపించే కమ్మ ని నీటిని ప్రవహించిన నదులలో బురద కలిసిన కొత్తనీరు ప్రవహించి, ఆ నీరు తాగడానికి, వాడుకోవడానికి పనికిరానివై, దాదాపు విషతుల్యములుగా మారిపోయి ప్రవహించాయని సహజ సుందరంగా, సాధార ణంగా వర్షాకాలంలో కనిపించే దశ్యాలను చదివినంతనే జ్ఞాపకానికి వచ్చేలా వర్ణించాడు ధర్మన్న. 

క. తొరలెడువానలఁదడియుచు

గిరిచఱిఁగూర్చుండియోగికేసరిదినముల్

మరుదశనంబునఁగడుపుచ్నఁ

జిరకాలంబుగ్రతపమ్నఁజేయుచునుండెన్. 

( ద్వితీయాశ్వాసం, 26)

అలా మిక్కుటంగా కురిసే వానలలో తడుస్తూ, కొండ చరియలలో యోగి కేసరి వలె కూర్చుని, మరుదశనంబున--అనగా గాలినే ఆహారంగా తీసుకుంటూ చాలా కాలం ఉగ్రమైన తపస్సును తుల్యుడు చేశాడు. 

అలా రోజులు గడిచి, వర్షాకాలం పోయి హేమంతం వచ్చింది. చలి విజంభించింది. జనం గడగడ వణికారు. 

ఉ. అమ్మునియట్టివేళహదయంబుననంబురుహాక్షునిల్పి లో

కమ్ములకద్భుతంబుగ వికార మెఱుంగకకంఠదఘ్న నీ

రమ్ములలోననుండియుదరమ్ముదకంబులఁబ్రోదిసేయుచున్

నెమిఁ్మదపంబొనర్చెధరణీవరులున్సురలున్వడంకఁగన్.

( ద్వితీయాశ్వాసం 36)

చిత్తంలో శ్రీహరిని నిలిపి, కంఠం దాకా నీటిలో మునిగి, ‘ఉదరమ్ముదకంబులఁబ్రోదిసేయుచున్’--అనగా నీటిని మాత్రమే ఆహారంగా తీసు కుంటూ, తన ఉగ్రమైన తపస్సును భూలోక జనములు, సురలోక వాసులు భయపడే విధంగా కొనసాగించాడు తుల్యుడుఅని వర్ణించాడు ధర్మన్న. 

వ్యాసకర్త సెల్: 99591 20528

భట్టు వెంకటరావు