24 July, 2026 | 3:23 AM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా..

24-07-2026 01:00 AM

తాడ్వాయిలో ధర్నా, రాస్తారోకో

తాడ్వాయి, జూలై, 23( విజయ క్రాంతి ): కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖరిగే, ప్రియాంక గాంధీ ల అరెస్టుల కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడువాయిలో గురువారం ధర్నా రాష్ట్రాలకు నిర్వహించారు.ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డుపై అరగంట సేపు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ ముందు మార్చు నిర్వహించిన విద్యార్థులకు మద్దతు పలకడం కోసం వచ్చిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం బాధాకరమన్నారు.

కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమవుతుందని విమర్శించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబీర్ శ్యాం రావు,షౌకత్ అలీ, రఘుపతిరావు, రాజేశ్వర్ రెడ్డి,మెట్టు రామచంద్రం, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.