23 May, 2026 | 6:39 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

భారత్ కు ట్రంప్ బిగ్ షాక్..

06-08-2025 08:25 PM

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరోసారి భారతదేశంపై బాంబు పేల్చారు. ఇటీవలే ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాలపై అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే, డొనాల్డ్ ట్రంప్ బుధవారం భారతదేశంపై మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ ఈరోజు సంతకం చేశారు. దీనితో భారతదేశంపై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరుకుంటాయి. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తునందున ట్రంప్ భారతదేశంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆగస్టు 7 నుండి ప్రారంభ సుంకం అమలులోకి వచ్చినప్పటికీ, అదనపు సుంకం 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది.