12 May, 2026 | 8:51 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

వచ్చే 9 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

21-02-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 5 : ఈ నెల 22 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపారు. 22న ఉదయం 6 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

అత్యవసరమైతే పోలీస్ అధికారుల అనుమతితీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.