నిష్పక్షపాతంగా కోఆపరేటివ్ ఎన్నికలు
కలెక్టర్ హరిచందనకు కేంద్ర పురస్కారం
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మహేశ్ కోఆపరే టివ్ బ్యాంక్క్ సంబంధించిన కోఆపరేటివ్ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించినందుకు కలెక్టర్ హరిచందనకు భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 మంది జిల్లా కలెక్టర్లలో ఐదుగురిని మాత్రమే ఈ పురస్కారానికి ఎంపిక చేయగా,
అందులో హరి చందన కూడా ఒకరుగా నిలిచారు. ఈ అవార్డును భారత ప్రభుత్వ సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ ఈ నెల 12న ఆమెకు ప్రదానం చేశారు. హరి చందన నాయకత్వంలో ఈ కోఆపరేటివ్ ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించబడ్డాయని అధికారులు తెలిపారు. శాఖల మధ్య సమన్వయం, సమయపాలనతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.




