అనుమానంతో భార్యపై భర్త దాడి
పరిస్థితి విషమం
ఆలేరు, మార్చి 16 (విజయక్రాంతి): భా ర్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)లో సోమవారం జరిగింది. ఆత్మ కూరు (ఎం)కు చెందిన గుర్రాల దేవి (33)కి మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన వెంపటి మహేందర్‌కు 2012లో వివాహం జరిగింది. ప్రస్తుతం అతను బీబీనగర్‌లో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గతకొంత కాలంగా ఇద్దరి మధ్య కలహాల జరుగుతున్నాయి.
20 రోజుల క్రితం సికింద్రా బాద్‌లోని బాలాజీ నగర్‌లో ఉంటున్న తన అత్తా, మామల ఇంటికి దేవి వెళ్లింది. అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మ హేం దర్ సోమవారం ఆత్మకూరు (ఎం) వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అక్క డే ఉన్న కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో ఆ మెపై దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. క్షతగాత్రురాలిని స్థానికులు ఆత్మకూరు పీహె సీకి తరలించారు, పరిస్థితి విషమంగా ఉండడంతో మె రగైన చికిత్స కోసం ఆమెను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.




