calender_icon.png 7 February, 2026 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక దందాను అడ్డుకోలేరా?

07-02-2026 11:31:26 AM

అయినా వారైతే అనుమతులు ఉండవా?

పోలీసుల తీరుపై స్థానికంగా విమర్శలు

మోతె,(విజయక్రాంతి): అక్రమ ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నట్టు స్థానికంగా బలంగా వినిపిస్తుంది. రోజుకి పదుల సంఖ్యలో మండలం నుంచి ఇసుక తరలిస్తున్న దాన్ని అడ్డుకునేటటువంటి అధికారులే కరువయ్యారు. ఇక్కడ పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు మండలం మీదుగా తరలిపోతున్న కానీ అడ్డుకునే అధికారులు కరువయ్యారు. అటు రెవెన్యూ అధికారులు గానీ పోలీసులు గానీ, మైనింగ్ వాళ్ళ జాడగాని లేకపోవడంతోని అక్రమార్కులు ఇసుకను అక్రమంగా ఇష్టానుసారంగా తరలిస్తున్నారు.

ఒక్కొక్క ట్రిప్పుకు సుమారు 6000 నుంచి 7000 రూపాయల వరకు అక్రమంగా నడుపుకుంటున్నారు. వారికి ఎటువంటి అనుమతులు ఉండవు అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా రోజుకి ఒక్కొక్క వ్యక్తి నాలుగు ట్రిప్పులు ఇసుకను తరలిస్తున్న గాని అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం చర్చానిశంగా మారింది. ఇలా స్పందించకపోవడానికి గల కారణం ఏంటి అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అటు రెవెన్యూ వాళ్ళుగాని పోలీసులు గాని స్పందించకపోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇదే విషయాన్ని పలువురు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన గాని ఇటీవల కాలంలో నాలుగు బండ్లు పట్టుకున్నట్లు విశ్వాసనీయంగా తెలుస్తుంది ఈ నాలుగు బండ్లలో రెండు బండ్లు వదిలేసి రెండు బండ్ల మీద కేసు చేసినట్టు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది.

ఈ రెండు ట్రాక్టర్లు వదిలేసి మిగతా రెండు  ట్రాక్టర్ల మీద కేసులు చేయడం ఏంటనేటటువంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి స్థానికంగా స్థానికులు చర్చించుకుంటున్నట్లు రెండు ట్రాక్టర్ల మీద కేసు చేసి రెండు ట్రాక్టర్లను వదిలేయడం వెనుక అర్థం ఏంటి అనేటటువంటి స్థానికంగా చర్చ సాగుతున్నటు తెలుస్తుంది. ఏది ఏమైనా అక్రమంగా తరలిస్తున్నటువంటి, ఇసుకను అడ్డుకోలేరా అనేటటువంటి. ప్రశ్నలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్టలు వెయ్యాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.