మరకత శివలింగానికి ఐలయ్య పూజలు
11-08-2026 12:52 AM
శంకర్‌పల్లి, ఆగస్టు 10(విజయక్రాంతి): మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలిసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రంతో ఎమ్మెల్యేను ఆలయ చైర్మన్ కుమార్ సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ సాకలి నరసింహులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, దేవాలయ కోశాధికారి ప్రశాంత్ గౌడ్, చెందిప్ప గ్రామ బీసీ సంఘం అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, దోసాడ డాకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






