17 May, 2026 | 3:34 AM

నమ్మితే ఖాతా ఖాళీ

17-05-2026 12:00 AM

తస్మాత్ జాగ్రత్త: డీఐ మాన్‌సింగ్

ఉప్పల్, మే 16 (విజయక్రాంతి): డబ్బు ఆశ చూపించి నమ్మే విధంగా చేసి సైబర్ నేరగాళ్లు ఖాతాను ఖాళీ చేస్తారని అపరిచిత వ్యక్తుల చరవాణి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నాచారం డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ మాన్‌సింగ్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నేహపురి కాలనీలో ఎస్‌ఐ ఫ్రాన్సిస్‌తో కలిసి సైబర్ నేరాలపట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని నేర రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. మోసాలపై ఇంట్లోని పెద్దలకు వివరించాలన్నారు. అనుమానితుల కాల్ చేస్తే బ్యాంకు వివరాలు తదితర వాటిని చెప్పొద్దన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు టోల్ ఫ్రీ 1930 నెంబర్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలని డీఐ వివరించారు. ఈ కార్యక్రమంలో నాచారం ఏఎస్‌ఐ ఈదయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.