17 May, 2026 | 2:35 AM

క్రషర్ అనుమతులు రద్దు చేయాలి

17-05-2026 12:00 AM

కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలో గ్రామస్తులు

మేడ్చల్, మే 16 (విజయక్రాంతి): రావలకోలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 111 సర్వే నంబర్‌లో ప్రజాభిప్రాయా నికి భిన్నంగా క్రషర్ ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. 2021 నవంబర్ నెలలో క్రషర్ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, అప్పట్లో తాము వ్యతిరేకించామని తెలిపారు. కానీ 2026 ఫిబ్రవరిలో మైనింగ్ ఏడి అనుమతి ఇవ్వడం అక్రమన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మునీరాబాద్ శివారులో ఒక క్రషర్ మూత పడిందని దానికి సంబంధించి రాయల్టీ 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు.

ఆ క్రషర్ యజమాని కుటుంబంలోని మరొకరి పేరు మీద రావలుకోలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అవినీతికి పాల్పడి అను మతి ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందపురం నరేష్, మామిండ్ల వెంకటేష్, మామిండ్ల ఆనంద్, బంటు నర్సింగరావు, బంటు మల్లేష్, సుక్క శేఖర్, గడిల రమేష్, ఎర్రవల్లి హారత్ రెడ్డి, గున్నాల రాముగౌడ్, తెడ్డు రాజారామ్, మామిండ్ల గణేష్, శ్రీశైలం, గుమ్మడి బిక్షపతి, సాయి శ్రావణ్, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.