20 August, 2026 | 3:29 AM

ఆదివాసీ బంద్ విజయవంతం

20-08-2026 12:49 AM
  1. పోలీస్ నియామకాల్లో ప్రత్యేక కోటా కేటాయించాలి
  2. తుడుందెబ్బ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): పోలీస్ ఉద్యోగ నియామకా ల్లో ఆదివాసీలకు గతంలో మాదిరిగా ప్రత్యేక కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ పోరాట సంఘం తుడుందెబ్బ ఇచ్చిన బంద్ పిలుపు బుధవారం జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. పట్టణంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడగా, బ స్సుల రాకపోకలకు సైతం అంతరాయం ఏ ర్పడింది.తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదుట నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ 20 16, 2017, 2019 సంవత్సరాల్లో జరిగిన పో లీస్ ఉద్యోగ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ప్రత్యేక కోటా కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుత పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రత్యేక కోటా ప్రస్తావన లేకపో వడం ఆదివాసీ యువత హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివాసీలు ఇప్పటికే అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు, అధికారులు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపో వడంతో మరింత నష్టపోతున్నారని అన్నారు.

ఆదివాసీ యువత హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామ ని, ప్రస్తుత నోటిఫికేషన్ను వెంటనే సవరించి ప్రత్యేక కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.తుడుందెబ్బ బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లా కేంద్రం తో పాటు ఏజెన్సీ మండలాలు జై నూర్ , తిర్యాని ,లింగాపూర్, సిర్పూర్ యు , కెరామేరి, వాంకిడి మండలాలో దుకాణా లు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డా యి.

సాధారణంగా బంద్లు మధ్యాహ్నం వరకు కొనసాగుతుండగా, ఈ బంద్ సా యంత్రం వరకు కొనసాగింది. దీంతో పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు స్తంభించా యి.బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎ స్పీ అశోక్, సీఐ నీలం రవి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ మండలాల్లో నూ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.