19 June, 2026 | 5:22 PM

బడిబాటలో భాగంగా బడికి పోని సుమారు 50 మంది చిన్నారుల గుర్తింపు

19-06-2026 01:47 PM

బివిరావు నగర్ పౌల్ట్రీ ఫామ్ లలో ఎంఈఓ పర్యటన..!

షాద్ నగర్ జూన్ 19 (విజయక్రాంతి): షాద్ నగర్  పరిధిలోని బివి.రావు నగర్ పౌల్ట్రీ ఫార్మ్స్ రైస్ మిల్లులలో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీల పిల్లలు బడికి పోకుండా ఉంటున్న సుమారు 50 మంది  చిన్నారులను ఫరూఖ్ నగర్ మండల విద్యాశాఖ అధికారి టి.మనోహర్,ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి పర్యటించి గుర్తించారు  బడికి పోకుండా ఇంటివద్దె కాలయాపన చేస్తు విద్యను  నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో  చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ చిన్నారులను బడికి పంపించే విధంగా వారిని చైతన్యపరిచి బడికి పంపాలని తల్లితండ్రులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు స్కూలు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనం  ప్రభుత్వం అందిస్తుందని  దిన్ని తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని సూచించారు