10 May, 2026 | 6:34 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్, వేదికలు ఖరారు

02-06-2025 07:48 PM

ఈ ఏడాది భారత్, శ్రీలంక వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్ జరగనుంది. మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్, వేదికలు, తేదీలను తాజాగా షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) అధికారికంగా ప్రకటించింది.  సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికల్లో మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భారత్ సహా 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు భారత్ లో చిన్నస్వామి(బెంగళూరు), ఏసీఏ(గువాహటి), హోల్కర్(ఇందౌర్), ఏసీఏ-వీడీసీఏ(విశాఖపట్నం), శ్రీలంకలోని ఆర్.ప్రేమదాస(కొలంబో) మైదానాలు ఆతిథ్యం వహించనున్నాయి. అక్టోబర్ 29వ తేదీన గువాహటి లేదా కొలంబోలో మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్-1 మ్యాచ్, అక్టోబర్ 30న బెంగళూరులో సెమీఫైనల్-2 మ్యాచ్, నవంబర్ 2వ తేదీన జరిగే  ఫైనల్ మ్యాచ్ కు బెంగళూరు లేదా కొలంబో అతిథ్యమివ్వనుంది. అయితే, ఈ టోర్ని మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.