అహ్మదాబాద్‌లో ఐసీసీ మీటింగ్
పీసీబీ చీఫ్ నఖ్వీ హాజరవుతాడా ?
దుబాయి, మే 16 : ఐపీఎల్ ఫైనల్‌కు ఆ తిథ్యమివ్వనున్న అహ్మదాబాద్‌లో ఐసీసీ కీలక సమావేశం కూడా జరగబోతోంది. రా బోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్‌లోనే జరగనున్నాయి. దీనికి అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.మే 21న చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ వర్చువల్ సమావేశం నిర్వహిం చనున్నారు. ఆ తర్వాత మే 30-,31 తేదీల్లో ఐసీసీ బోర్డు ప్రత్యక్ష సమావేశం జరగనుం ది. ఈ సమావేశానికి ప్రపంచ క్రికెట్ బోర్డుల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
అ యితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సి న్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ఈ సమావేశాలను మార్చి లేదా ఏప్రిల్లో ఖతార్లో నిర్వహించాలని భావించారు. కానీ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. అ నం తరం దీనిని అహ్మదాబాద్‌కు మార్చారు. భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో నఖ్వీ అహ్మదాబాద్‌కు రాకపోవచ్చనే వార్త లు వస్తున్నాయి. మరోవైపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జర గనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు నఖ్వీకి ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలే దు. పీసీ బీ ఛైర్మన్‌గా నఖ్వీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీసీసీఐతో మంచి సంబంధాలు లేవు. ఆసియా కప్ ట్రోఫీ ని తీసుకుని వెళ్లిపోవడం, టీ20 ప్రపంచకప్ నిర్వహణ సమ యంలో బంగ్లా ను రెచ్చగొట్టడం వంటి కారణాలతో వివాదాల్లో నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ కు వ్యతిరేకంగా కొన్ని దేశాలను ఏకం చేస్తున్నాడన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. బీసీ సీఐతో పాటు ఐసీసీ ఛైర్మన్ జైషాపైనా ఒకదశలో పరోక్ష విమర్శలు చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా జరి గే ఐసీసీ మీటింగ్‌కు నఖ్వీ హాజరయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు.






