17 May, 2026 | 2:32 AM

ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ

17-05-2026 01:13 AM

థాయ్‌లాండ్ ఓపెన్ 

బ్యాంకాక్, మే 16 : భారత బ్యాడ్మింటన్ డబుల్స్‌లో నెంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ షెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇటీవల థామస్ ఉబెర్ కప్ నుంచీ అద్భుతంగా రాణిస్తున్న సాత్విక్ జోడీ థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ అదరగొడుతోంది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. తాజాగా సెమీఫైనల్‌లో మలేషియా జోడీ గో జెఫీ ఇజుద్దీన్‌పై 19- 22- 21-16 తేడాతో విజయం సాధించింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సాత్విక్ జోడీ అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. తొలి గేమ్‌ను మలేషియా జోడీ గెలుచుకోగా, రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్న భారత జంట 22 గెలిచి స్కోర్ సమం చేసింది.

ఇక మ్యాచ్ ఫలితాన్ని తేల్చే మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. చివరికి సాత్విక్ పైచేయి సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. ఈ విజయంతో మలేషియా జోడీపై తమ ఓవరాల్ హెడ్ టూ హెడ్ రికార్డును 8 మెరుగుపరుచుకుంది. కాగా ఫైనల్స్‌లో భారత్ జోడీ ఇండోనేషియాకు చెందిన కర్నాడో,మార్తిన్ జంటతో టైటిల్ కోసం తలపడనుంది. ఇటీవల బ్యాడ్మింటన్‌లో టైటిల్స్ గెలిచినా తమను పట్టించుకోవడం లేదంటూ సాత్విక్  చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే సింధు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ సైతం నిరాశపరిచాడు.