మత్స్యశాఖ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా
24-08-2026 01:01 PM
తుంగతుర్తి మత్స్యశాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
తుంగతుర్తి( విజయ క్రాంతి): తుంగతుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన మత్స్యశాఖ కమిటీని జిల్లా సహకార సంఘం కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ కె.పద్మజ అధ్యక్షతన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో మత్స్యశాఖ అధ్యక్షుడిగా రెండోసారి కొండ లింగయ్య, ఉపాధ్యక్షుడిగా అంబటి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా మామిడి నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం లింగయ్య మాట్లాడుతూ.. మత్స్యశాఖ సభ్యుల సమస్యలను పరిష్కరించుటకు, తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.






